telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐఫా అవార్డ్స్ కు అనుకోని అతిథి… వీడియో వైరల్

IIFA

మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఇటీవలే కన్నుల పండవగా జరిగింది. 2019 సంవత్సరానికి గాను “ఐఫా-2019” ఉత్తమ నటీనటులుగా అలియాభట్, రణవీర్‌సింగ్‌లు ఎంపికయ్యారు. “రాజీ” సినిమాలో అలియాభట్ ఉత్తమనటనకు ఐఫా ఉత్తమ నటి అవార్డు లభించింది. పద్మావత్ సినిమాలో తన అద్భుత నటనకు గుర్తింపుగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు ఐఫా అవార్డు వరించింది. ఈ అవార్డులను ముంబై నగరంలో వారు అందుకున్నారు. “అంధాధూన్” సినిమా దర్శకుడు శ్రీరాం రాఘవన్ కు ఉత్తమ దర్శకుడిగా ఐఫా అవార్డును ప్రదానం చేశారు. ఇంకా చాలా మంది కళాకారులకు… వివిధ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. సరే… అదంతా ఒక ఎత్తు. ఆ వేడుకలకు ఓ కుక్క వెళ్లింది. నిజానికి ఆ ఫంక్షన్‌లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అక్కడకు ఆ డాగ్ వెళ్లడం విశేషం. దాన్ని ఇంటర్వ్యూ చేసింది నటి అదితి భాటియా. హాయ్… ఇక్కడకు అనుకోని అతిథి వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం అంటూ అదితి భాటియా కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. ఆ కుక్క కూడా వాటికి సమాధానంగా… తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. జస్ట్ రెండు రోజుల్లో ఈ వీడియోని ఏడు లక్షల మందికి పైగా చూశారు.

 

View this post on Instagram

 

Spread love! 🐶❤️

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

Related posts