telugu navyamedia
రాజకీయ వార్తలు

బాలాకోట్ లో మళ్లీ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు: భారత ఆర్మీ చీఫ్

army chief ravath checking in LOC

పుల్వామా దాడి త‌ర్వాత భారత వైమానిక దళం పాకిస్థాన్ బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాన్ని నేధ్వంసం చేసిన తెలిసిందే. అయితే ఇప్పుడక్కడ మళ్లీ ఉగ్ర‌వాదులు త‌మ కార్య‌క‌లాపాల‌ను పున‌రుద్ద‌రించిన‌ట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్ప‌ష్టం చేశారు. ఈ రోజు చెన్నైలోని సైనికాధికారుల శిక్షణ కేంద్రంను రావత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాకోట్ లో సుమారు 500 ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు తెలిపారు.

అయితే అదే స్థావ‌రం పై మ‌రోసారి స‌ర్జిక‌ల్ దాడి చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని రావ‌త్ తెలిపారు. అయితే ఈసారి తమ సైనిక చర్య గత దాడుల కంటే తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ లో చొరబడి కల్లోలం సృష్టించేందుకు సరిహద్దు పొడవునా వందల మంది ఉగ్రవాదులు అదను కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. అయితే ఈసారి తమ సైనిక చర్య గత దాడుల కంటే తీవ్రంగా ఉంటుందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. క‌శ్మీర్‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌న్నారు. క‌శ్మీర్‌లో విధించిన ఆంక్ష‌లను నెమ్మ‌దిగా ఎత్తివేస్తామ‌న్నారు.

Related posts