telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మట్టిని మూర్తిగా మలచాలనే సంకల్పం…

మట్టిని మూర్తిగా మలచాలనే సంకల్పం…
కళకు జీవం నింపాలనే తాపత్రయం .
శ్రమను తలవని దేహంతో…
భూమాతకు ప్రణమిల్లుతూ..
పెల్లపెల్లను నుగ్గు నుగ్గుగా చేసి…
నీటి ధారను అర్పణగావించి…
మట్టిని మూర్తిగా మలచెనో మహాశిల్ప.!!
మనోసంకల్పంతో
చేతులనే కుంచెలుగా చేసి
మట్టితో మట్టినే రంగరించి మూర్తిగా మలచి..
పూజలందుకునేలా చేసావు కదయ్యా
నీ జన్మ చరితమైనది ఇలలో…
ఎంతటి భాగ్యం నీదయ్యా! ఓ మహాశిల్పి.!!
అంతలోనే ఒక ప్రకంపనం…
భూమి కోసం నీటి కోసం జీవనం కోసం కాదు
కులమతాల కోసం తపించే మృగ సంచారం..
మూకుమ్మడిగా దాడి చేసింది…
ఇది మాదైవం కాదంటూ..
ఇది మామత చిహ్నం కాదంటూ….
నేల రాలింది శిల్పం తన ఆకారం కోల్పోతూ..
నేల తల్లి నిర్ఘాంతపోయింది…
నాకే లేని కులమత తారతమ్యం.. వ్యత్యాసం
నాలో కలిసే మీకెందుకంటూ….?
శిల్పి నిరంతర శ్రమజీవి…
తిరిగి మరో శిల్పానికి రూపు దిద్దుతున్నాడు
తనకు కులం మతం అడ్డు కాదంటూ..
తన జీవితం కళకే అంకితమంటూ…

Related posts