telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎంత కష్టపడినా నాకు గుర్తింపు దక్కలేదు : నికిషా

Nikisha-Patel

తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన నికిషా దక్షిణాది సినిమాల గురించి మాట్లాడింది. `తెలుగు, తమిళ సినిమాలంటే బోర్ కొట్టేసింది. వాటిపై ఆసక్తి లేదు. దక్షిణాదిన 25కు పైగా సినిమాలు చేశాను. ఎంత కష్టపడినా నాకు గుర్తింపు దక్కలేదు. సరైన పాత్రలు రాలేదు. దాంతో నేను పాత్రల ఎంపిక విషయంలో సర్దుకుపోవాల్సి వచ్చింది. నేను తమిళ సినిమాల్లో నటించినప్పటికీ నన్ను చివరి వరకు `పవన్ హీరోయిన్`గానే చూశారు. పవన్ నటించిన `పులి` సినిమాతో నేను అరంగేట్రం చేయడం వల్ల ఆ పేరు పెట్టేశారు. ప్రస్తుతం లండన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నా. ఇకపై నన్ను అందరూ గొప్ప నటిగా చూస్తార`ని నికిషా ఆశాభావం వ్యక్తం చేసింది.

Related posts