telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రఘురామ కృష్ణంరాజుపై పెట్టిన 124 A దేశద్రోహం కేసుతో జరిగే పరిణామాలు ఏంటో తెలుసా !

Jail

1837 లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను తయారు చేసినప్పుడు అపుడు ఉన్న సెక్షన్ 133గా ఉన్న దేశద్రోహం నిబంధనను 1870లో ఐపీసీలో సెక్షన్ 124-ఏ గా చేర్చారు! ఇది భారతీయ శిక్షా స్మృతి చట్టంలోని ఐపీసీ‌ సెక్షన్!

ఈ సెక్షన్ ప్రకారం మాటలతో కానీ చేతలతో కానీ సంకేతాలతో కానీ ప్రదర్శనలతో కానీ మరే విధంగానైనా కానీ.. భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనలను ప్రేరేపించిన లేదా ప్రేరేపించటానికి ప్రయత్నించిన వారు ఎవరినైనా జీవితఖైదు ద్వారా కానీ దీనికి అదనంగా జరిమానాతో కానీ‌ మూడు సంవత్సరాల వరకూ కారాగారవాసం ద్వారా కానీ జరిమానా ద్వారా కానీ శిక్షించవచ్చు”

1897 లో బాల గంగాధర తిలక్ 1922 లో గాంధీ పై ఈ సెక్షన్ పై అరెస్టు చేశారు! పౌరుడి స్వేచ్ఛను అణచివేయటానికి రూపొందించిన చట్టం ఇది” అని మహాత్మాగాంధీ మాట! ఆ తర్వాత వాక్‌స్వాతంత్ర్యం – భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు ‘దేశద్రోహం’ అనే పదం అవరోధం కారాదనే అంశం మీద పార్లమెంటు విస్తృతంగా చర్చించి చివరికి రాజ్యాంగంలో దేశద్రోహం అనే పదాన్ని తొలగించారు! సెక్షన్ మాత్రం కొనసాగించారు! “ఎంత త్వరగా ఈ చట్టం వదిలించుకుంటే అంత మంచిది” అని 1951 లో నెహ్రూ మాట! అయితే కాంగ్రెస్ మాత్రం అవినీతి ఆరోపణలు చేసిన కొందరిపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం! కేదార్‌నాథ్ తన ప్రసంగంలో ”విప్లవాగ్నిలో పెట్టుబడిదారులు, జమీందార్లు, దేశాన్ని లూటీ చేయటమే పనిగా పెట్టుకున్న భారత కాంగ్రెస్ నాయకులు బూడిదవుతారు” అనే మాటల ద్వారా ప్రభుత్వాన్ని హింసాయుత మార్గంలో కూలదోసే ఆలోచనను ప్రేరేపించారు కనుక ఆయనను దేశద్రోహం ఆరోపణలో దోషిగా నిర్ధారించింది” 1962 లో ఈ కేసు ఆధారంగా వాక్ స్వాతంత్రపు పరిమితికి ఇది అవసరం అని సుప్రీం సమర్థిస్తూనే సెక్షన్‌ను వర్తింపచేయాలంటే మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించటం లేదా హింసకు ప్రేరేపించే ఉద్దేశం ఉండటం ఒక ఆవశ్యకతగా చేర్చింది!

ఇందిరా గాంధీ హత్య సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బల్వంత్ సింగ్ కేసులో 1995లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ.. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదా ప్రతిస్పందనను ప్రేరేపించని కొన్ని నినాదాలను ఇద్దరు వ్యక్తులు పలుమార్లు చేయటం దేశద్రోహం కిందకు రాదని, అలా రావాలంటే మరింత తీవ్రమైన చర్యలు అవసరమని, ఈ నినాదాల వల్ల నిజంగా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని పేర్కొంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది! చాలాకాలం తర్వాత 2016 లో మళ్లీ సుప్రీం లో విచారణకు వచ్చినపుడు కేదారనాథ్ కేసు మార్గదర్శకంగా ఉండాలని మళ్ళీ తీర్పు!

2016లో కన్నయ్యకుమార్ ఇటీవల దిశా రవి పై కూడా భాజపా ఈ కేసు నమోదు చేసింది! ఒక నకిలీ వీడియో కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ దుష్టులకు కళ్లెం వేయాలనే పేరుతో అసమ్మతివాద స్వరాన్ని అణచి వేయటానికి దేశద్రోహం చట్టాన్ని ప్రయోగించజాలరు అని వ్యాఖ్యానించటం గమనార్హం! నిందితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడాలని ప్రజలని ప్రేరేపించనిదే లేదా ప్రజల్లో అశాంతిని రాజేసే ఉద్దేశంతో హింసకు ప్రేరేపించనిదే వారిపై దేశద్రోహం అభియోగాలు మోపజాలరని సుప్రీంకోర్టు కూడా స్పష్టంచేసింది!

కేంద్రంలో ఈ కేసు నమోదు చేస్తే వ్యతిరేకించి రాష్ట్రంలో నమోదు చేస్తే సమర్థించే డబుల్ స్టాండర్డ్ వ్యక్తులకు నేను చెబుతున్న మాట.. గతంలో 33% నిర్దారణ ఉన్న ఈ కేసులు ప్రస్తుతం నిర్దారణ చేయలేక కేవలం భయభ్రాంతులకు గురి చేయటానికి నిరంకుశ ప్రభుత్వాలకు ఇది ఒక బెదిరింపు ఎత్తుగడ గా మాత్రమే మిగులుతోంది!

Related posts