హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నేడు విజయనగర్ కాలనీలోని మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.మైత్రి ప్రియ తెలిపారు. నగరంలోని కెఫే కాఫీ డే, డోమినో పిజ్జా, పయనీర్ ఇ ల్యాబ్స్, కోన ఈ డేలా సొల్యూషన్స్, ఫ్యూచర్ లైఫ్ ైస్టెల్ ఫ్యాషన్ లిమిటెడ్ కంపెనీలలో 500 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనీస విద్యార్హతతో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులను జూనియర్ కిచెన్ ఎగ్జిక్యూటివ్, ఆధార్ ఆపరేటర్, క్యాషియర్, ఫ్యాషన్ కన్సల్టెంట్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి కల అభ్యర్థులు నేడు తమ బయోడేటా, విద్యా ర్హతల జిరాక్స్ సర్టిఫికెట్లతో విజయనగర్ కాలనీ మల్లేపల్లి ఐటీఐ క్యాం పస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉ 10:30 గంటలకు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యుర్థులు వివరాలకు యంగ్ ప్రొఫెషనల్ టి. రఘుపతి , 8247656356 లో సంప్రదించాలని మైత్రి ప్రియ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా