నేడు ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రత్యేక హోదా సమితి బంద్ పాటిస్తుంది. దీనికి ఇప్పటికే చంద్రబాబు మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా, కేంద్రం తీరుకు నిరసనగా నల్లచొక్కా ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..సాధారణంగా నిరసన తెలపాలి అంటే నల్ల బ్యాడ్జి ధరిస్తారు.. కానీ నేడు ఏపీసీఎం ఏకంగా నల్ల చొక్కానే ధరించారంటే, వారు ఎంత పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారో..
* ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించారు.
* ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు రాష్ట్రం నలుమూలల జరుగుతున్నాయి.
* విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు ఫిబ్రవరి 1ని నిరసన దినంగా పాటించాలని సీఎం వ్యాఖ్యానించారు.
* ఏపీకి ప్రత్యేక హోదా అమలును నీరుగారుస్తున్న ప్రధాని మోడీ వ్యవహార సరళిని ముఖ్యమంత్రి ఖండించారు.
* ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందివ్వడంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్లదుస్తులు ధరించాలని సీఎం పిలుపునిచ్చారు.
కాగా, నేటి బందుకు జనసేన పార్టీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మద్దతు ప్రకటించారు కాబట్టే, పవన్ దూరంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.