నూతన ఇసుక విధానం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో ఇసుక సరఫరా పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరతలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇసుక సరఫరాలో మొదట స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులతో చెప్పారు. ఇసుక సరఫరా రోజుకు లక్ష టన్నులకు పెంచాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల టన్నులు సరఫరా అవుతోందని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మూడు నెలలుగా ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
సీఎంకు అధికారాలు లేవని సీఎస్ ఎలా అంటారు: రాజేంద్రప్రసాద్