టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మల్టీస్టారర్ `వెంకీమామ`. విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ “డిసెంబర్ 13న `వెంకీమామ`తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వారం పదిరోజులుగా యూనిట్ అందరిలో థ్రిల్లర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్కషన్ నడిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నా కెరీర్‌లో మనం, వెంకీమామ చిత్రాలు జ్ఞాపకాలు. రేపు ఎన్ని సినిమాలు వచ్చినా, వీటిని రీప్లేస్ చేయలేం. ప్రతి విషయంలో ఈ సినిమ పరంగా బెస్ట్‌గానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం నా కోరిక. లేట్‌గా జరిగినా లేటెస్ట్‌గా ది బెస్ట్‌గా జరిగింది. అది వెంకీమామ పక్కన చేయడం. ప్రేమమ్‌లో ఒక సీన్‌లో చేసేటప్పుడే చాలా ఎగ్జయిట్ అయ్యి చేశాను. ఈ సినిమాలో ప్రతి సీన్‌లో ఎగ్జయిట్‌గా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయన్నుండి నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను” అన్నారు.
previous post