telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదే : కీరవాణి

keeravani

రాజమౌళి కీరవాణి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి సినిమా తీస్తే ఆసినిమాకి సంగీతంతో ప్రాణం పోసేవ్యక్తి కీరవాణి. తాజాగా రాజమౌళి గురించి కీరవాణి మాట్లాడుతూ .. మొదటి నుంచి కూడా రాజమౌళికి పట్టుదల ఎక్కువ. ఒక విషయాన్ని మనసులో అనుకుంటే దానిని సాధించేవరకూ పోరాడుతూనే ఉంటాడు. అలాగే రాజమౌళికి ఏకాగ్రత ఎక్కువ ఏ విషయాన్నైనా వెంటనే పట్టేస్తాడు. ఆ పనిని తాను ఎంత పెర్ఫెక్ట్ గా చేయగలననే దానిపైనే దృష్టి పెడతాడు. ఆయనలో నాకు నచ్చే అంశాలు ఇవే. ఇక రాజమౌళి ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తుంటాడు. కాస్త పరిణతి కలిగిన సినిమాలు చూడమంటూ వాటి పేర్లను సూచించినా పట్టించుకోడు. ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ఓ పక్కకి వెళ్లి చిన్నపిల్లల సినిమాలు చూస్తూ కూర్చుంటాడు. ఆయనలో నాకు నచ్చని విషయం ఇదే అంటూ నవ్వుతూ చమత్కరించాడు. 

Related posts