telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పేపర్ డ్రెస్సులో పాయల్ … పిచ్చెక్కించేస్తోందిగా

payal

లాక్ డౌన్ పుణ్యమా అని సెల‌బ్రెటీలు ర‌కార‌కాల ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. రోజురోజుకూ క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కిస్తూ రెచ్చిపోతోంది పాయల్ రాజ్‌పుత్. ఇటీవల తలగడను డ్రెస్ గా ధరించి పిల్లో ఛాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన పాయ‌ల్‌. తాజాగా పేప‌ర్ డ్రెస్‌తో అలరించింది. హాస్య బ్రహ్మ జంధ్యాల రూపొందించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమా `అహ నా పెళ్లంట`. డబ్బులు ఆదా చేయడం కోసం ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ న్యూస్ పేపర్‌ను మడిచి లుంగీలాగ కట్టుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ పాయల్ కూడా ఆ ఫ్యాషన్‌ను ఫాలో అయింది. న్యూప్‌పేప‌ర్స్‌నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. కొంద‌రు పాయ‌ల్ క్రియేటివిని పొగుడుతుంటే మ‌రొకొంద‌రు మాత్రం పాయ‌ల్ డ్రెస్సింగ్‌పై మీమ్స్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆర్ ఎక్స్‌100 సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ‌ మొద‌టి సినిమాతోనే హిట్టు కొట్టింది. అందాల ఆరబోతలో కూడా వెనక్కి తగ్గడంలేదు.

Related posts