ఈ నెల 11న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చాలా వరకు ఈవీఎం ల సమస్య తలెత్తినదని తెలిసిన ఈసీ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏపీసీఎం చంద్రబాబు సహా 15 మంది టీడీపీ పార్టీ నాయకులు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి పిర్యాదు చేశారు.
కేంద్రం సహా ఏపీలోని ప్రతిపక్షాలు కలిసి ఈవీఎంల తో మాయ చేస్తున్నాయని.. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. అధికారం చేతులో ఉంది కదా అని, ఎన్నికల సంఘాన్ని కూడా స్వతంత్రంగా పనిచేయనీయకుండా ఎన్నికలలో ఇంత గలాటా చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధం అని, న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని బాబు అన్నారు.