telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పిచ్చి అభిమానంతో స్టార్ హీరోను పెళ్ళి చేసేసుకున్న త్రిష…!

Trisha

సాధారణంగా చాలామంది తమ అభిమాన హీరో, హీరోయిన్లను ఆరాధిస్తారు. అయితే చాలా మంది సెలబ్రిటీలకు ఫ్యాన్స్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఓ డైహార్డ్ ఫ్యాన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏకంగా స్టార్ హీరోని పెళ్లే చేసేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ త్రిషా పేటాస్. త్రిషకు ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ అంటే ప్రాణం. ఏకంగా పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. త్రిష అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అది ఎలాగో కుదరదు కాబట్టి బ్రాడ్ పిట్ కార్డ్‌బోర్డ్‌ను తయారు చేయించుకుంది. అమెరికాలోని ఓ చర్చ్‌కి కార్డ్‌బోర్డ్‌ను తీసుకుని వెళ్లింది. అక్కడ ఆ కార్డ్‌బోర్డ్‌ను పెళ్లి చేసుకుని తన కలను ఈ రకంగా నెరవేర్చుకుంది. పెళ్లికి త్రిష తల్లిదండ్రులతో పాటు ఎందరో గెస్ట్‌లు కూడా వచ్చారు. అంతేకాదు తన కూతురికి పెళ్లైపోయిందని త్రిష తల్లి కన్నీరుపెట్టుకోవడం డ్రమాటిక్‌గా ఉంది. ‘ఎప్పుడూ నాతో పాటు ఉండే వ్యక్తిని, నాతో మాట్లాడలేని వ్యక్తిని, నేనేం చేసినా తప్పుబట్టలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు’ అని త్రిష పేర్కొంది. ఆల్రెడీ ఏంజిలినా జోలీతో విడిపోయి బాధలో మునిగి తేలుతున్న బ్రాడ్ పిట్‌. అతనికి మరో పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా లేవు. బ్రాడ్‌పిట్, ఏంజిలినా జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఫ్యాన్స్ వీరిని బ్రాంజెలినా అని పిలుచుకుంటారు. కానీ తాగుడుకు అలవాటు పడిన బ్రాడ్ పిట్ పిల్లల్ని హింసిస్తున్నాడని ఏంజిలినా అతనికి విడాకులు ఇచ్చేసింది. ఏంజిలినా కంటే ముందు బ్రాడ్ పిట్‌కు జెన్నిఫర్ యానిస్టన్‌తో పెళ్లైంది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను త్రిష తన అఫీషియల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. మరి ఈ వీడియో చూసి బ్రాడ్ పిట్, అతని మాజీ భార్య ఏంజిలినా జోలీ ఎలా ఫీలవుతారో చూడాలి. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts