telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంతను పోలిన మరో బ్యూటీ

Aathmika

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను పోలిన వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేశారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా సమంతలా ఉన్న మరో బ్యూటీని అభిమానులు గుర్తించారు. షార్ట్‌ఫిలింస్‌, టీవీ షోలు, సినిమాల్లో నటించిన చెన్నై సుందరి ఆత్మిక మోడలింగ్‌ కెరీర్‌ నుంచి తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఆత్మిక ఫొటోషూట్‌ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోల్లో ఆత్మిక చాలా అందంగా కనిపించడంతో పాటు నటి సమంతలా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ‘అచ్చం సమంతలా ఉంది. కొంపదీసి సమంత చెల్లి కాదు కదా’ అంటూ సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘ఏదేమైనప్పటికి మరో సమంత దొరకడం మా అదృష్టం’ అంటున్నారు అభిమానులు. ఈ దెబ్బతో ఆత్మిక లైఫ్‌స్టైల్‌ ఎలా మలుపుతిప్పుతుందో చూడాలి. అప్పట్లో బిగబాస్‌ ఫేం అషు రెడ్డి అచ్చం సమంతలా ఉందంటూ ఆమె ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అయ్యాయి.

Related posts