కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలిచాడు. వలస కార్మికుల కష్టాలకు చలించిపోయిన సోనూ సూద్ వారిని తన సొంత డబ్బుతో ఇళ్లకు చేర్చిన విషయం తెలిసిందే. సోనూ చేసిన సేవలను ప్రజలే కాదు.. ప్రభుత్వాలు సైతం మెచ్చుకున్నాయి. ఇదిలా ఉంటే సోనూసూద్ జీవితం పై ఓ సినిమా తీయాలని పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు చూస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ స్పందిస్తూ… “నా బయోపిక్ తీస్తే హీరోగా నేనే చేస్తా … దానికి కారణం లేకపోలేదు నా జీవితంలో ఎదురైన బాధలు, కష్టాలు నాకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు కాబట్టి నేనే హీరోగా చేస్తా” అని సోను చెప్పుకొచ్చారు.
previous post