telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఊర్మిళపై కంగనా వ్యాఖ్యలు… రామ్ గోపాల్ వర్మ రియాక్షన్…!

Kangana

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై, డ్రగ్స్ వ్యవహారంపై కంగనా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో బీజేపీలో టికెట్‌ కోసమే కంగన ఇలా చేస్తోందన్న ఊర్మిళ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘నాకు రాజకీయ పార్టీలో టికెట్‌ పొందడం అంత కష్టమేమీ కాదని తెలివైన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన వల్ల కాకుండా శృంగారతారగానే ఊర్మిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అలాంటి ఆమే టికెట్‌ పొందితే.. నేను ఎందుకు పొందలేను’’ అని కంగనా ట్వీట్‌ చేయడం మరో వివాదానికి దారి తీసినట్లుగా అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూలో రామ్ గోపాల్ వర్మ కూడా దూరి సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పలు సినిమాల్లో నటించి ఫేమస్ అయిన హాట్ హీరోయిన్ ఊర్మిళకు సపోర్ట్ చేశాడు వర్మ. ”బాలీవుడ్ తారలు ఇలా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు. ఏదిఏమైనా ఊర్మిళ తన టాలెంట్‌తో సత్తా చాటింది. ఆమె ఓ విలక్షణ నటి” అని పేర్కొన్నారు. మరోవైపు ఊర్మిళ సైతం కంగనా వ్యాఖ్యలపై స్పందించకపోవడం గమనార్హం.

Related posts