telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇమ్యూనిటీ పెంచుకోవడానికి స్వీట్ ?

Immunity-Sandesh

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవాలని వైద్యులు చెబుతూనే ఉన్నారు. దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం లిస్టులోకి ఇప్పుడు ‘ఇమ్యూనిటీ సందేశ్‌’ అనే స్వీట్‌ వచ్చి చేరింది. స్వీట్‌ తయారి అంటే అందులో బెల్లం గాని, చక్కెర గాని తప్పనిసరి. కానీ, ఈ ఇమ్యూనిటీ స్వీట్‌లో చక్కెర, బెల్లం రెండూ వాడలేదు. బదులుగా హిమాలయ తేనెను ఉపయోగించారు. అంతేకాదు 11 రకాల మూలికలతో స్వీట్‌ను తయారు చేశారు. తులసి, పసుపు, ఏలకులు, లైకోరైస్‌, జాజికాయ, అల్లం, గాలాంగల్‌, పీపుల్‌, నల్ల మిరియాలు, నల్ల జీలకర్ర, బే ఆకులు వంటి మూలికలను తీసుకున్నామని కోల్‌కత్తా స్వీట్‌ షాపుకు చెందిన అధిపతి సుదీప్‌ మల్లిక్‌ చెప్పుకొచ్చారు. ఈ మూలికలన్నింటినీ వంటలకు వాడతాం. ఇవి కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయుర్వేద నిపుణులను సంప్రదించి దీని తయారీకి పూనుకున్నారు. చక్కెర లేదా బెల్లం ఈ మూలికల సామర్థ్యాన్ని తగ్గించగలదని, అందుకే తేనెను దాని స్థానంలో ఉపయోగించారని చెప్పారు. రెండురోజుల నుంచి 25 రూపాయలకు ఇమ్యూనిటీ సందేశ్‌ను విక్రయిస్తున్నాడు.

Related posts