‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన రెండు టాప్ నిర్మాణ సంస్థలు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాయి.ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెప్పనక్కర్లేదు.ఇప్పటికే ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాటను 4 కోట్ల మందికి పైగా విన్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇందులో అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మార్చి 25న సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు. మున్నా దర్శకత్వం వహించారు.
previous post
next post