ఒకేసారి స్పేస్‌వాక్‌ను పూర్తి చేసి నాసా మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్ లు ఒక కొత్త చరిత్రనే సృష్టించారు. అంతరిక్ష చరిత్రకు సంబంధించి ఇద్దరు మహిళలు ఒకేసారి స్పేస్ వాక్ చేయడం ఇదే తొలిసారి కాబోలు. వీరిద్దరూ విద్యుత్ నియంత్రణ యూనిట్‌కు మరమ్మత్తు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయట ఏడు గంటల సమయం పాటు గడిపారు. ఇప్పటికే క్రిస్టీనా కోచ్ నాలుగు సార్లు స్పేస్ వాక్ చేయగా, జెస్సికా మెయిర్‌కు మాత్రం ఇదే తొలిసారి. అంతరిక్షంలో నడిచిన 15 వ మహిళగా జెస్సికా నిలిచారని నాసా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా స్పేసులో వీరికి వీడియో కాల్ చేసి వారిని అభినందించారు. ”మీరు చాలా ధైర్యవంతులు, తెలివైన మహిళలు” అని వారు స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు ట్రంప్ తెగ పొగిడేసాడు.
ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన క్రిస్టీనా కోచ్, మెరైన్ బయాలజీలో డాక్టరేట్ పొందిన జెస్సికా నాసా స్పేస్‌యూనిట్స్ నుంచి బయట అడుగు పెట్టారు. బ్యాటరీ ఛార్జ్ డిశ్చార్జ్ యూనిట్ (బీసీడీయూ)ను ఏర్పాటు చేసేందుకు పోర్ట్ 6 ట్రస్ స్ట్రక్చర్ అనే ప్రదేశానికి వీరిద్దరూ వెళ్లారు. పనిచేయని భాగాలను తమతో పాటు తిరిగి ఐఎస్ఎస్‌కు తీసుక వచ్చారు. ఈ సంఘటన ‘చారిత్రాత్మకం కంటే ఎక్కువ’ అని డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి “కమలా హారిస్” ట్వీట్ చేశారు. ‘ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్’ లో భాగంగా అన్నే మెక్ క్లైన్‌తో కలిసి క్రిస్టీనా కోచ్ ”ఎక్స్‌ట్రా-వెహికల్ యాక్టివిటీ” (ఈవీఏ) లో పాల్గొంటారని మార్చిలో నాసా తెలిపింది. కానీ, మెక్‌క్లెయిన్‌కు సరిపోయే స్పేస్ సూట్ అందుబాటులో లేకపోవడంతో ఆమె స్పేస్‌వాక్ లో పాల్గొనలేక పోయారు.
బిగ్‌బాస్‌పై గీతామాధురి కామెంట్స్ …