telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

యువత మనసులో .. కత్తులు ఎక్కడ నుండి వస్తున్నాయి.. ? ఉన్మాదులు ఎవరు ?

Two sons murder after father sucide

ప్రేమ పేరో మరొకటో చెప్పి ఇటీవల యువత మనసులలో నరకాలనే ఆలోచనలు వస్తున్నాయి. అది చేస్తున్నారు కూడా కొందరు. దీనివెనుక అసలు కారణాలు ఎక్కడ ఉన్నాయి, బంగారు భవిష్యత్తుతో దేశతలరాతను మార్చాల్సిన ముక్కుపచ్చలారని యువత మనసులలో హింస ఎందుకు పేరుకుపోతుంది..? ఇంత అసహనం ఎందుకు వారి మనసులలో గూడుకట్టుకుంటుంది.. ? దీనికి ఎవరు కారణం, స్వచంగా ఉండాల్సిన వారి మనసులలో కత్తులు, రక్తపు కాంతులు ఎందుకు మొలకెత్తుతున్నాయి..? విద్యాలయాలలో ఏమి జరుగుతుంది..? ఈ ప్రశ్నలన్నింటికీ ఎంత త్వరగా సమాధానం తెల్సుతుందో.. అంతే త్వరగా ఈ హింసా ప్రవృత్తి నుండి వారిని బయటకు తీసుకురావచ్చు. అప్పుడే దేశపురోభివృద్ది సాధ్యం, లేదంటే శాంతి యుత దేశం.. నిజంగానే తీవ్రవాదానికి నెలయంగా అవుతుంది అనడానికి ఈ సంఘటనలే స్పష్టమైన ఉదాహరణలు. ఇంకా మేల్కోకపోతే.. రేపటిపై ఆశలైనా వదులుకొని బ్రతుకునేట్టుకోవాల్సి వస్తుంది.

మరో ఉన్మాదిని ఉత్పత్తి చేసిన మన ప్రవర్తన..
తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని బర్కత్ పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన మధులిక అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమించాలని మధులికను కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే యువతి ఇందుకు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి మధులికను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు బాధితురాలు ససేమీరా అంది. దానితో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో మధులిక మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కల వారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Related posts