telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జాతిని ఉద్దేశించి … మోడీ ప్రసంగం..

modi speech on J & K

జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వం నిర్ణయం తరువాత పరిణామాలపై నేడు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒకే భారత్-ఒకటే రాజ్యాంగం అనే కల సాకారమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్యాంప్రసాద్ ముఖర్జీ కల సాకారమైంద ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ..కశ్మీర్-లడఖ్ తో కొత్త శకం ప్రారంభమైంది. కశ్మీర్ లో ఉగ్రవాదం, కుటుంబవాదం తప్ప సాధించిందేమి లేదు. 370 ఆర్టికల్ ను పాక్ నిరంతర ఆయుధంగా మలుచుకుని ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. . దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసే చట్టాలన్నీ ఇకనుంచి కశ్మీర్ కూడా వర్తిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు.

విద్యా హక్కు చట్టం దేశమంతా అమలైంది..కశ్మీర్ లో కాలేదు. కశ్మీర్ బాలలు ఏం పాపం చేశారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది..కశ్మీర్ లో లేదు. దేశవ్యాప్తంగా కనీస వేతన చట్టం అమలులో ఉంది..కశ్మీర్ లో లేదు. అదే విధంగా మైనార్టీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఉంది..కశ్మీర్ లో లేదని మోదీ తెలిపారు. కశ్మీర్ లో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి రాజకీయ పదవులు లభించలేదన్నారు.

Related posts