ఆర్టికల్ 370 రద్దు పై కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం ఘాటుగా స్పందించారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని చిదంబరం అన్నారు. బీజేపీ విద్వేషపూరిత ఆలోచనల నుంచే ఈ బిల్లు పుట్టిందని ఆరోపించారు. ఈ నిర్ణయం తప్పని చరిత్రే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు.
370 అధికరణాన్ని అదే అధికరణలోని నిబంధన కింద రద్దు చేయలేమని అన్నారు. రద్దు ద్వారా నియంత్రించలేని శక్తులను నిద్ర లేపుతున్నారని విమర్శించారు. ‘ఈ విధానం మిగతా రాష్ట్రాల్లోనూ అనుసరించరని నమ్మకమేంటి? అని ప్రశ్నించారు. ఇలాగైతే రాష్ట్రాలను ముక్కలు చేయకుండా కేంద్రాన్ని ఎవరు ఆపగలరని అన్నారు. ఈరోజు నిర్ణయం అన్ని రాష్ట్రాలకూ తప్పుడు సంకేతాలు పంపుతుందిని ఆయన అభిప్రాయపడ్డారు.