telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శ్యామ్ సింగరాయ్ పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతుందా..?

Vijay Shyam Singa Rai

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ప్రభాస్ వెనకాలే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రాంచరణ్‌లు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో వారికి కూడా నార్త్ బెల్ట్‌లో మార్కెట్ ఏర్పడుతుందని ధీమాగా ఉన్నారు. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ బన్నీ రాజమౌళి కోసం ఎదురు చూడకుండా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్నా పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ప్లాన్ చేస్తున్నాడు. ఇక మరో అగ్ర హీరో మహేష్ కూడా రాజమౌళితో ఓ సినిమా లాక్ చేసేశాడు కాబట్టి దిగులు అక్కర్లేదు. అగ్రహీరోలు ఓకే మరి మిడిల్ రేంజ్ హీరోల పరిస్థితి ఏంటి. ఈ రేంజ్ హీరోలలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న నాచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టొచ్చని అంటున్నారు. అంతేకాకుండా నాని చేయనున్న శ్యామ్ సింగరాయ్ సినిమాని ఇతర భాషల్లో విడుదల చేయట్లేదని ప్రకటించలేదు. దాంతో నానీ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగు పెడగాడా అని అనుకుంటున్నారు. అయితే ఇతర భాషల్లో విడుదల చేయాలని ఆలోచన ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా బాగా వచ్చింది అనిపిస్తే అప్పుడు ఈ సినిమాను తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోకి అనువదిస్తారట. అయితే ఈ సినిమా పునఃజన్మ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌తో ఉంటుంది. ఇందులో నాని ఓ రచయితగా కనపించనున్నాడట.

Related posts