telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థుల జాబితా విడుదల

AP

ఉపాధ్యాయ నియమాకాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2018 అభ్యర్థుల జాబితా విడుదలైంది. ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్లు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. వీటిని https://schooledu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

సెప్టెంబర్‌ 23న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను, సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో ట్రయిన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్‌ చేస్తామని చెప్పారు. మొదటి ప్రోవిజినల్‌ సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకారం ఉద్యోగ అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.

Related posts