రిటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌లో పాల్గొనడానికి మరియు దేశ నిర్మాణానికి దోహదపడే అవకాశాలను అందించడానికి ఉద్దేశించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క రెండు కొత్త స్కీమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.
రెండు వినూత్నమైన, కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాలు దేశంలో పెట్టుబడి ల పరిధి మరింత విస్తరిస్తాయని అన్నారు. ఈ పథకాలు మరింత సురక్షితమైనవి. పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్‌లను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తాయి’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌తో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టొచ్చన్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకంతో బ్యాకింగ్ రంగంలో ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్ వ్యవస్థ’ రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ..ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్కీమ్స్‌ను ప్రకటించారు. కరోనా కారణంగా కుదేలైపోయిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడమే ప్రధాన లక్ష్యంగా గవర్నర్ శక్తికాంతా దాస్ ఈ స్కీమ్స్‌ను తీసుకొచ్చారు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు రిటైల్ పెట్టుబడులను పరోక్షంగా అనుమతిస్తున్నాయి.తాజా స్కీంతో భారత్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
దీనిద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లను అనుమతించిన తొలి ఆసియా దేశంగా గుర్తింపు పొందింది.ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో ఉచితంగా తీసుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా