చెన్నై సూపర్ కింగ్స్‌ను కరోనా వైరస్ వదలట్లేదు. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లారు. హస్సీ కంటే ముందు ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా వైరస్ సోకింది. బాలాజీ ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. బ్యాటింగ్ కోచ్ కావడం వల్ల మైక్ హస్సీ నెట్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్లందరికీ మెళకువలు నేర్పించేవాడు. నెట్ ప్రాక్టీస్‌ను దగ్గరుండి పర్యవేక్షించేవాడు. ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు సహా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన టాప్ బ్యాట్స్‌మెన్లకు ఆయన వద్ద నెట్ ప్రాక్టీస్ చేసినవారే. అలాంటి హస్సీ కరోనా వైరస్ బారిన పడటం తాజాగా ఆ జట్టు మేనేజ్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ జట్టు మొత్తం ఐసొలేషన్‌లోకి వెళ్లింది. వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లల్లో కరోనా భూకంపం పుట్టించింది
previous post