telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ మామ

Narne srinivasa rao crucial position in ycp

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు గురువారం లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పారు. అనంతరం నార్నె మీడియాతో మాట్లాడుతూ తాను గత పదేళ్ల నుంచి వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా గెలిపించుకోవడం కోసమే పార్టీలో చేరినట్లు నార్నె చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేది జగనేనని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. నార్నె శ్రీనివాసరావు కేవలం పార్టీలో చేరడంతోనే సరిపెడతారా లేక ఎక్కడ నుంచైనా పోటీ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి నార్నె ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. తాను వైసీపీలో చేరడానికి.. తన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కేవలం అది తన వ్యక్తిగత అభిప్రాయమని నార్నె స్పష్టం చేశారు.

Related posts