అమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గురువారం ట్వీట్ చేసింది. అమెరికాలో వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి సరిగ్గా 90 రోజుల ముందు I-797 ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ట్వీటింది.
ఈ హెచ్1బీ వీసా ద్వారా ఎక్కువ మంది భారతీయులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ వీసా జారీ ప్రక్రియలో అమెరికా ఎన్నో అంక్షలు విధిస్తోంది. ఈ వీసా ద్వారా అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య పెరిగిపోతుందని, ఫలితంగా అమెరిన్లకు నష్టం వాటిల్లుతోందని చెబుతూ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం అమెరికా లో 6.50లక్షల మంది విదేశీయులు హెచ్1బీ వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు.
పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్