telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుపతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో, విజయభేరి సభకు అభిమానులు, ప్రజలు భారీగా హాజరుఅయ్యారు.

తిరుమల పవిత్రతను కాపాడతాం, తిరుపతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్

తిరుపతి నగరంలో రోడ్ షో నిర్వహించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్థానిక గాంధీ రోడ్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, ఏడుకొండలవాడికి గోవిందా గోవింద అంటూ ప్రారంభించారు.

తిరుపతి అభివృద్దికి చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో మంగళం సమీపంలోని ఆశా కన్వన్షన్ సెంటర్ నుంచి ర్యాలీ సాగింది. దాదాపు రెండు కిలో మీటర్ల పాటు సాగిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది.

రోడ్ షో సాగుతున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రదర్శన చీకట్లోనే సాగింది.

వైసీపీ ప్రభుత్వ ఇక్కడి నుంచి అమరరాజాను తరిమేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరరాజాను తీసుకువస్తాం. ప్రజలు గనుక కరుణాకర్ రెడ్డికి గానీ, వాళ్లబ్బాయికి గానీ ఓటేస్తే.. ప్రతి దాంట్లో 10:30 నిష్పత్తిలో పంపకాలు చేసుకుంటారు.

కరుణాకర్ రెడ్డి, వాళ్లబ్బాయి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి… శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లన్నింటిని నరికేశారు. రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కాం జరిగింది… డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఈ పరిస్థితి మార్చుకోవాలంటే కూటమి ప్రభుత్వం రావాలి.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి నెల రెండో మంగళవారం తిరుపతి ప్రజలు తిరుమల వెంకన్నను దర్శించుకునే అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడా వెసులుబాటు తీసేశారు.

తిరుపతి ప్రజలకు రెండో మంగళవారం నాడు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండా చేశారు. మేం వచ్చాక దాన్ని పునరుద్ధరిస్తాం అని పవన్ ప్రసంగిచారు

Related posts