telugu navyamedia
సినిమా వార్తలు

48 సంవత్సరాల “మగాడు”

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు గారు నటించిన మరొక సాంఘిక చిత్రం రాజ్యం ప్రొడక్షన్స్ వారి “మగాడు” చిత్రం 19-05-1976 విడుదలయ్యింది.

నిర్మాతలు లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు, శ్రీకాంత్ నహతా లు హిందీలో విజయవంతమైన “దీవార్ ” చిత్రం ఆధారంగా రాజ్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు యస్.డి.లాల్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు: డి.వి.నరసరాజు, కథ: సలీం జావేద్, పాటలు: సి. నారాయణరెడ్డి, సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ: శ్రీకాంత్, నృత్యం: సలీం, కళ: బి.చలం, ఎడిటింగ్: SPS వీరప్ప అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, మంజుల, రామకృష్ణ, లత, కాంతారావు, అంజలీదేవి, .ప్రభాకర్ రెడ్డి, జయమాలిని, త్యాగరాజు, ధూళిపాళ, రావి కొండలరావు,ముక్కామల, కె.వి.చలం, రాధా కుమారి తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు హిట్ అయ్యాయి.
“కోరుకున్నా నిన్ను చేరుకున్నా”
“సలసలసల కాగినకొద్దీ నీరు”
“కొట్టేసిండు బంగారంలాంటి మనసు”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని కొన్ని కేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నది.
విజయవాడ – జైహింద్ టాకీస్ 61 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమా మొత్తం మీద 10వారాలు ఆడింది..

Related posts