telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ హీరో

Sandeep-KIshan

ఒకపక్క కరోనా వలయతాండవం చేస్తుంటే… మరోపక్క టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే నితిన్ , నిఖిల్, రానా వరుసగా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. ఇక మెగా డాటర్ నిహారిక కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా మరో యంగ్ హీరో కూడా పెళ్ళికి సిద్దమవుతున్నాడని తెలుస్తుంది. ‘రొటీన్ లవ్ స్టోరీ’తో హీరోగా పరిచయమై సందీప్ కిషన్ హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సందీప్ తాను కూడా పెళ్ళికి రెడీ అయ్యానని హింట్ ఇచ్చాడు. ట్విటర్ వేదికగా ఓ పెద్ద అడుగు వేయబోతున్నా అని పేర్కొన్నాడు. “2020 నా జీవితం గురించి చాలా విషయాలను పున:పరిశీలన చేసుకునేలా చేసింది. నన్ను సంతోషపరిచే విషయాలపై ఆలోచించుకునే అవకాశం కలిగింది. నా జీవితంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి నాకు ధైర్యాన్ని సమయాన్ని ఇవ్వండి. బహుశా చాలా ఉత్తేజకరమైన ఆ వార్తను చెప్పేందుకు ఆగలేను. సోమవారం వరకూ ఆగండి” అంటూ సందీప్ ట్వీట్ లో వెల్లడించాడు. దీంతో ఈ యంగ్ హీరో కూడా పెళ్ళికి సిద్ధమయ్యాడని టాలీవుడ్ టాక్.

Related posts