telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముద్దు అడిగిన నెటిజన్…ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన హేమ

Hema

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హేమ. టాలీవుడ్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ హేమ ముందుంటుంది. బోల్డ్‌గా మాట్లడటంలోనూ వెనక్కి తగ్గదు హేమ. తాజాగా హేమ ఇంటివద్దనే ఉండటంతో సోషల్ మీడియా లైవ్‌లోని అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలోనే హెయిర్‌ గురించి పలు చిట్కాలు చెప్పుకొచ్చింది. దీనికి హేమ ఆయిల్ అనే పేరు కూడా పెట్టింది. ఈ ఆయిల్‌ని తయారు చేసి మా అమ్మ నాకు రాసేది. ఇప్పుడు ఆ చిట్కాని ఉపయోగించి అదే ఆయిల్ నా కూతురికి కూడా వాడుతున్నట్లు తెలిపింది. అలాగే తయారీ విధాన్నాన్ని చెబుతుండగా ఈ లోపు కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్స్ చేయడడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది హేమ. ఓ నెటిజన్.. ఐ లవ్‌ యూ బేబీ అని మెసేజ్‌లు పెడుతూ హేమని ముద్దు అడిగాడు. దీనితో హేమ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తిక్క తిక్క వేషాలు నా దగ్గర వేయొద్దు ఇంటికొచ్చి మరీ తంతా వెధవ అంటూ నేను పైకి ఇలా కనిపిస్తాను. లోపల ఇంకో క్యారెక్టర్ ఉంది. దాన్ని బయటకు తీయొద్దు. పళ్లు ఊడగొట్టి చేతిలో పెడతా.. నా గురించి ఏమనుకుంటున్నావో జాగ్రత్త’ అంటూ చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది హేమ.

Related posts