telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు

Mani-Rathnam

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం చేసిన సడలింపులతో త్వరలో దేశ వ్యాప్తంగా మళ్ళీ షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి. కాగా లాక్ డౌన్ తో సినీపరిశ్రమ, థియేటర్ లు భాగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో హీరోలు, టెక్నికల్ సిబ్బంది తమ రెమ్యూనేషన్ ను తగ్గించుకోవాలని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. ఇటీవల ఓ వెబినార్‌లో పాల్గొన్న మణిరత్నం ఈ విషయంపై స్పందించారు. థియేట్రికల్‌ బిజినెస్‌ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంతవరకు హీరోలు, టెక్నిషియన్ లు తమ పారితోషికం తగ్గించుకుని ప్రొడ్యూసర్ లకు సహకరించాలన్నారు.

Related posts