telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ ఎన్కౌంటర్ : ఇది దిశ బయోపిక్ కాదు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Disha

వివాదాలకు మారుపేరుగా మారిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ‘దిశ ఎన్కౌంటర్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు వర్మ. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్‌ చంద్ర ఈ సినిమా దర్శకుడు. అయితే ఈ సినిమాను ఆపాలంటూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత నట్టికుమార్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. సినిమాను సినిమాలా మాత్రమే చూడాలని, చట్టాలకు లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఎవ్వరి మనోభావాలను కించపరచే విధంగా సినిమాను తీయడం లేదన్న నట్టి.. దిశ బయోపిక్ తాము తీయడం లేదని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మళ్ళీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం దిశ తల్లిదండ్రులు ఎవ్వరిని సంప్రదించలేదని తెలిపారు. నవంబర్ 26 న దిశ ఎన్ కౌంటర్ చిత్రం రీలీజ్ చేస్తున్నామని, కోర్టు ఎలా తీర్పు ఇస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. దిశ కమిషన్ కు సంబంధించిన విషయాలు చిత్రంలో ఏమి చెప్పలేదన్నారు. సినిమా ట్రైలర్ మీద పోకిరీలు పెట్టె కామెంట్స్ పై తాము ఏమి స్పందించలేమన్న ఆయన.. పోలీసులు సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. వర్మ వచ్చిన తర్వాత ఈ ‘దిశ’ చిత్రం పై పూర్తి వివరాలు వెల్లడిస్తారని అన్నారు.

Related posts