telugu navyamedia
సినిమా వార్తలు

53 సంవత్సరాల “రైతు బిడ్డ”

నందమూరి తారకరామారావు గారు నటించిన మరొక సాంఘిక చిత్రం లక్ష్మీ కళా చిత్ర వారి “రైతు బిడ్డ” సినిమా 19-05-1971 విడుదలయ్యింది.

నిర్మాత కోట్ల వెంకట్రామయ్య గారు లక్ష్మీ కళా చిత్ర బ్యానర్ పై మేడా వెంకటరమణమూర్తి నిర్వహణ లో ప్రఖ్యాత దర్శకుడు బి.ఏ.సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: జి. బాల సుబ్రహ్మణ్యం, స్క్రీన్ ప్లే: బి.ఏ.సుబ్బారావు, మాటలు: పినిశెట్టి, పాటలు: కొసరాజు, సి.నారాయణరెడ్డి, సంగీతం: సాలూరి హనుమంతరావు, ఫోటోగ్రఫీ: జె.సత్యనారాయణ, కళ: వాలి, నృత్యం: జెమిని రాజు, ఎడిటింగ్: మార్తాండ్, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, శాంతకుమారి, రాజనాల, జగ్గయ్య, అనూరాధ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రాజబాబు, ఛాయాదేవి, శ్రీధర్, నల్లరామమూర్తి, ఏ.ఎల్.నారాయణ, ఆనందమోహన్, తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు యస్.హనుమంతరావు గారి సంగీత సారధ్యంలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
“దేవుడు సృస్తించాడు లోకాలూ,
ఈ మనిషే కల్పించాడు తేడాలూ”
“ఆ..అమ్మ, ఆ..ఆవు, అమ్మ వంటిదే ఆవు”
“రైతే రాజ్యం ఏలాలీ, మన రైతుకు రక్షణ కావాలీ”
“విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి”
“మనిషిని నమ్మితే ఏముందిరా ”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన పలు కేంద్రాల్లో 50 రోజులు ఒక కేంద్రంలో డైరెక్ట్ గా 100
రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది. విజయవాడ – దుర్గా కళామందిర్ లో 101 రోజులు ప్రదర్శింపబడింది…

1971 లో వరసగా ఎన్టీఆర్ గారి చిత్రాలన్ని అపజయం పాలవుతున్న తరుణంలో “రైతుబిడ్డ” సినిమా 100 రోజులు ఆడి అభిమానుల పరువు నిలబెట్టింది.

ఆపిదప డిసెంబర్ మాసంలో “శ్రీ కృష్ణ సత్య ” సినిమా విడుదలై దిగ్విజయంగా ఏడు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడటంతో ఆ ఏడాది కూడా ఎన్టీఆర్ గారి రెండు సినిమాలు డైరెక్టుగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

Related posts