telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళందరికీ ఆర్ధిక సాయం అందించనున్న సూర్య

Surya

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తు్న్నారు. తెలుగులో సుధా కొంగర ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లపై సూర్య, రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర‌పాండ్యన్‌, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌లెక్షన్ కింగ్ డాక్టర్ ఎం. మోహ‌న్‌బాబు ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఇది అక్టోబర్‌ 30వ తేదీన విడుదల కానుంది.

కాగా సూర్య ఈ కరోనా సంక్షోభంలో మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. కళాకారులు, డిస్ట్రిబ్యూటర్లు, మీడియా, పీఆర్‌ఓలు, థియేటర్ల సిబ్బంది, కరోనా వ్యాధి బారిన పడ్డ వారిని కాపాడడానికి అహర్నిశలు శ్రమించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య శాఖ కార్మికులు, తన అభిమాన సంఘాలకు చెందిన వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా “సూరరై పోట్రు” ప్రసార హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫాం అమేజాన్‌ ప్రైమ్‌ కు విక్రయించారు. కాగా “సూరరై పోట్రు” చిత్రాన్ని విక్రయించిన మొత్తంలో రూ.5 కోట్ల వరకు అవసరమైన వారికి సాయం చేస్తానని సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, దర్శకుల సంఘం, నటీనటుల సంఘాలకు రూ.కోటిన్నర విరాళంగా అందించారు. తాజాగా పైన చెప్పిన సంఘాల్లో సభ్యులు కాని వారి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువు కోసం తలా పదివేలు అందించనున్నట్లు తెలిపారు. వీరంతా అగరం ఫౌండేషన్‌ చెందిన దరఖాస్తుల్లో వారి వివరాలను నమోదు చేసి పంపించాలని కోరారు.

 

Related posts