telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను కూడా దానికి బాధితురాలినే… : కస్తూరి

Kasthuri

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాయల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ “అనురాగ్‌పై నువ్వు చేసిన ఆరోపణలు కోర్టులో నిలబడవు. నేరాన్ని స్పష్టంగా ధృవీకరించే ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల నీకు ఏ న్యాయం జరగదు. దీనివల్ల మీ ఇద్దరిలో ఎవరో ఒకరి కెరీర్ నాశనమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కస్తూరి వ్యాఖ్యలపై స్పందించిన ఓ నెటిజన్… ఇలా పరిస్థితే మీకో, మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన కస్తూరి.. నా కుటుంబంలో ఏంటి.. నేనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. ఇండస్ట్రీలో నన్నూ వేధించారు. నేను కూడా దానికి బాధితురాలినే’ అంటూ అసలు విషయం చెప్పింది. ‘నిప్పురవ్వ’ ‘అన్నమయ్య’ ‘డాన్ శీను’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం ‘గృహలక్ష్మి’ సీరియల్‌లో నటిస్తోంది. ఇక పాయల్ వ్యాఖ్యలతో మరోసారి దేశవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ జరుగుతోంది. పాయల్ వ్యాఖ్యలపై బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుంటే… మరికొందరేమో అనురాగ్‌కు అండగా నిలుస్తున్నారు.

Related posts