కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తోందని, ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుబట్టారు. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అని విమర్శించారు. మద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్సార్ కృష్ణా నీళ్లను దోచుకుని, సాగర్ ఎడమ కాల్వ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహం చేశారని చెప్పారు. దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు తెరిపించి.. తెలంగాణ రైతులకు అన్యాయం చేశారని చెప్పారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతే ఊరుకునేది లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరు అని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది జల విద్యుత్ ఉత్పత్తి కోసమేనని, చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందన్నారు. తప్పు చేసిన వారే లేఖల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
previous post
సందర్భాన్ని బట్టి తాము పార్టీలు మారాం: రాజశేఖర్