telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరిన ప్రణబ్.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి నన్నెంతగానో బాధించింది. ఆయనతో మాట్లాడిన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. గొప్ప జ్ఞానం కలిగిన నిష్ణాతుడు ఆయన. అద్భుతమైన రాజకీయ జీవితం. మిమ్మల్ని కోల్పోతున్నాం సార్. దేశం ఒక విలువైన వజ్రాన్ని నేడు కోల్పోయింది. ప్రణబ్ దా ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ప్రణబ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related posts