రుచి మరిగిన బూచి..
ఏమి ఎరుగని నంగణాచి..
చూస్తూవున్నది పక్కనే వేచి..
వస్తానంటుంది కౌగిలికి చేయిచాచి..
హత్తుకున్నదంటే ఆపేస్తుంది నీ గుండే వాచీ..
పకపకా పరిహసిస్తుంది కోరలు తెరిచి….
వీరాధివీరులనైనా రాజుపేదలనైనా పట్టించుకోని మృచ్చి..
గుండె గుబేలుమనిపిస్తుంది జారేలా గోచి..
దానికి ప్రియమైన చోటు అంటే అశూచీ..
క్షణాల్లో చుట్టేసి పెట్టేస్తుంది ప్రాణానికి పేచీ..
మశూచికి మరదలు.. కలరాకి కలవారి కోడలు..
ప్లేగుకి పెద్దక్క…..ఎయిడ్స్ కి యారాలు..
మనిషి ఊపిరి తిత్తులకి ప్రియురాలు..
మహా ప్రపంచానికి మాయల మాంత్రి..
అది జత కట్టిందంటే అందరితో అనిపిస్తుంది ఛీఛీ..
ఛస్తే చూడనీయకుండా చితికుప్పల్లో పడెయిస్తుంది ఈడ్చి..
ఆత్మీయులందరికి అడ్డుగోడయ్యే చిచ్చులాడి
బంధవ్యా మాధుర్యమెరుగని మృచ్చులాడి..
అందరికి అందరూ వున్నారు.. కానీ
ఎవరికివారే యమునాతీరే….
ఎవరిని ఎవరికి కాకుండా చేస్తున్న కరోన..
నిన్ను నిందించడం తప్పే సుమా!..
నువ్వు కొత్తగా చేస్తున్నదేమి లేదు..
మానవత్వం నశించిన మానవలోకంలో …
నువ్వు ఇక్కడ ప్రవేశించక మునుపే మా నరులందరు చేస్తున్నదే ఇదే….
ఇప్పుడు నువ్వు పట్టుకుని చంపేస్తే ముట్టుకోవద్దు అంటున్నారే…గాని..
ఆస్తిపాస్తుల కోసం చంపేసిన..
ముసలి ముతక శవాలై
చెత్తకుప్పలో తేలుతున్న అనాధ గుట్టలెన్నో……
చూళ్ళేదా..
మాకు మాత్రం చూసి చూసి అలవాటైపోయింది…లే..
నవ్వుకోవాల్సింది నువ్వు కాదు …మేము..
ఆహ్హహ్హ..
పాపం కరోన…..