telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

నిలకడగా బంగారం..ఎగిసిపడ్డ వెండి ధరలు

మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…తాజాగా బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా ఉండిపోయింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,560 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500 పలుకుతోంది. బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 76,000 వద్ద కొనసాగుతోంది.

Related posts