telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మటన్‌ ధర నిర్ణయించిన ప్రభుత్వం..అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు!

mutton market

తెలంగాణలో కిలో మటన్‌ రూ. 700కే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ బాబు భేరి హెచ్చరించారు. ఈ మేరకు దుకాణాల ముందు ధర తెలిపే విధంగా బోర్డు లు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి తలసాని ఆదేశాల మేరకు మాం సం ధరల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ సభ్యులు సోమవారం దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, బజార్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు 11 మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్‌ లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐదు దుకాణాలను మూసి వేయించారు. షాపునకు వచ్చే వారు భౌతిక దూరంతో పాటు పరిశుభ్రత పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Related posts