telugu navyamedia
రాజకీయ వార్తలు

భూటాన్‌లో మోదీకి సైనిక స్వాగ‌తం..

modi speech on J & K

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కోసం భూటాన్ తరలివెళ్లారు. ఆయనకు పారో విమానాశ్రయంలో భూటాన్ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. విమానాశ్ర‌యంలో దిగిన మోదీకి ఆ దేశ ప్ర‌ధాని లోటే షేరింగ్ స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత మోదీ సైనిక స్వాగ‌తం అందుకున్నారు.

ప‌లు ద్వైపాక్షిక అంశాలపై రెండు దేశాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నాయి.ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేస్తూ, తన పట్ల భూటాన్ ప్రధాని చూపిన ఆదరణ హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు. ఇది ముఖ్యమైన పర్యటనగా భావిస్తున్నానని, విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికిన భూటాన్ ప్రధాని షెరింగ్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. భూటాన్ పర్యటనలో భాగంగా భారత్ 10 ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.

Related posts