కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ముందు వచ్చే ఆలోచన సెలవలు… అయితే గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది కాంబో సెలవలు తక్కువే అని చెప్పాలి. గతేడాది ఈ సెలవలు 16 వరకు ఉండగా, ఈసారి మాత్రం 10 లోపే ఉండటం తో అదనపు సెలవలు పెట్టుకోవడం తప్పదు. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2019లో వచ్చే సెలవులను ఓ సారి పరిశీలిస్తే…
జనవరి 1, మంగళవారం – నూతన సంవత్సరం
జనవరి 14, సోమవారం – భోగి
జనవరి 15, మంగళవారం – సంక్రాంతి
జనవరి 26, శనివారం – గణతంత్ర దినోత్సవం
మార్చి 4, సోమవారం – మహా శివరాత్రి
మార్చి 21, గురువారం – హోలీ
ఏప్రిల్ 5, సోమవారం – బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (తెలంగాణకు మాత్రమే)
ఏప్రిల్ 6, శనివారం – ఉగాది
ఏప్రిల్ 14, ఆదివారం – శ్రీరామనవమి, డాక్టర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 19, శుక్రవారం – గుడ్ ఫ్రైడే
జూన్ 5, బుధవారం – రంజాన్
జూన్ 6, గురువారం – రంజాన్ మరుసటి రోజు (తెలంగాణలో మాత్రమే)
జూలై 29, సోమవారం – బోనాలు (తెలంగాణలో మాత్రమే)
ఆగస్ట్ 12, సోమవారం – బక్రీద్
ఆగస్ట్ 15, గురువారం – స్వతంత్ర దినోత్సవం
ఆగస్ట్ 24, శనివారం – కృష్ణాష్టమి
సెప్టెంబర్ 2, సోమవారం – వినాయక చవితి
సెప్టెంబర్ 10, మంగళవారం – మొహర్రం
సెప్టెంబర్ 28, శనివారం – బతుకమ్మ సంబురాలు మొదలు (తెలంగాణలో మాత్రమే)
అక్టోబర్ 2, బుధవారం – మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 6, ఆదివారం – దుర్గాష్టమి
అక్టోబర్ 8, మంగళవారం – దసరా
అక్టోబర్ 27, ఆదివారం – దీపావళి
నవంబర్ 10, ఆదివారం – మిలాడినబీ
నవంబర్ 11, సోమవారం – గురునానక్ జయంతి
డిసెంబర్ 25, బుధవారం – క్రిస్మస్