telugu navyamedia
ట్రెండింగ్

వాహనదారులు హెల్మెట్ ధరిస్తే.. పెట్రోల్ ఉచితం అంటున్న ట్రాఫిక్ అధికారులు..

with helmet one lit petrol free

ప్రమాదాల నివారణపై అవగాహన ప్రచారం కల్పించడంలో భాగంగా, తమిళనాడులోని తిరుచెందూరులో హెల్మెట్‌ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి లీటర్‌ పెట్రోలును పోలీసుల ద్వారా పెట్రోలు బంక్‌ల యజమానుల సంఘం నిర్వాహకులు కలిసి ఉచితంగా అందించారు. తిరుచెందూరులోని 13 పెట్రోల్‌ బంక్‌లలో శుక్రవారం ‘సంతోష సమయం’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా హెల్మెట్లు ధరించిన వాహనచోదకుల బైకులు, స్కూటర్లు, మోపెడ్‌లను పెట్రోలు బంక్‌ల వద్దకు తీసుకెళ్లి ఒక లీటర్‌ పెట్రోలును ఉచితంగా పోసి పంపారు.

ఈ కార్యక్రమానికి తిరుచెందూరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ భారత్‌ ప్రారంభించారు. హెల్మెట్లు ధరించిన వాహనచోధకులు 30 మందికి లీటరు పెట్రోలును ఉచితంగా అందిం చారు. అదే సమయంలో హెల్మె ట్లు ధరించని వాహన చోద కులు లీటరు పెట్రోలును ఉచి తంగా పొందలేక పోయామని నిరాశ చెందారు. పెట్రోలు బంక్‌ల యజమానుల సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ హెల్మెట్‌ధారణపై అవగాహన ప్రచారం కల్పించే నిమిత్తం ప్రతి నెలా హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలు నడిపే వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు లీటర్‌ పెట్రోలును ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

Related posts