telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

మే 14 శుక్రవారం, దినఫలాలు : ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం

మేషం : ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండరాల వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వారికి శుభదాయకం. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సాహస యత్నాలు విరమించిండి.

వృషభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రుణం తీర్చడానికై చేయుయత్నాలు వాయిదాపడతాయి. షేర్ల అమ్మకం కంటే కొనుగోళ్లే లాభదాయకం మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. విద్యార్థులు ఇతరుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

మిథునం : వస్త్ర, బంగారం వెండి లోహ వ్యాపారాభివృద్ధికి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది.

కర్కాటకం : ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తికానరాదు. సంఘంలో నూతన వ్యక్తుల పరిచయం మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మధ్యవర్తిత్వం వహించడం వల్ల గుర్తింపు లభిస్తుంది. ఇతరులకిచ్చిన మాట నిలుపుకునేయత్నంలో శ్రమ, ప్రయాసలు ఎదుర్కొంటారు. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు తప్పవు.

సింహం : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. దంపతుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏసీ, ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి.

కన్య : అవివాహితులతో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల రాకపోకలతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యులతో అత్యంత సన్నిహితంగా మెలగడం వల్ల లబ్ది చేకూరే అవకాశం ఉంది.

తుల : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యంవల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి.

వృశ్చికం : స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం ప్రోత్సాహం లభిస్తాయి. తలపెట్టిన పెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదతో కృషి చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.

ధనస్సు : చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఎన్ని అవరోధాలు తలెత్తినా వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రులు కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు.

మకరం : విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెళకువతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు తప్పవు. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మీ చేసిన సహాయానికి మంచి గుర్తింపు లభిస్తుంది.

కుంభం : కీలకమైన చర్చలు, ఒప్పందాల విషయంలో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో పరస్పర అవగాహన కుదరదు. మీ యత్నాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి.

మీనం : బంధువర్గాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. నిరుద్యోగులకు త్వరలోనే ఒక మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. ఇతరుల కారణంగా భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

Related posts