విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. విశాఖలో జగన్ చేసిన భూకబ్జాలు బయటపడతాయనే వైసీపీ నేతలు భయపడుతున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు కాన్వాయిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం హేయమైన చర్యని యనమల అన్నారు.
వైసీపీ నేతలు తస్వార్థపూరిత ప్రయోజనాలకు పోలీసులు వాడుకుంటున్నారని విమర్శించారు. 40 ఏళ్లుగా తాను ఇంతటి అసహాయ పోలీసులను చూడలేదని అన్నారు. ఈ రోజు విశాఖలో జరిగింది చూడండి. వైసీపీ అడ్డుకుంటోంది.. చంద్రబాబుని అడుగు పెట్టనివ్వబోమని అంటున్నారు. పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.