telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు

భారత్ లో కరోనాపై ఆందోళన.. ప్రధాని మోదీకి రాహుల్ హితవు

rahul gandhi to ap on 31st

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని తప్పుబట్టారు. సమస్యను ఎదుర్కోవడంపైనే పూర్తిస్థాయిలో  దృష్టి పెట్టాలని రాహుల్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ‘భారత్ ఓ అత్యవసర స్థితి ముంగిట నిలిచిన తరుణంలో సోషల్ మీడియా అకౌంట్లతో విదూషకుడిలా వ్యవహరిస్తూ దేశ ప్రజల సమయాన్ని వృథా చెయ్యడం మానేయండి’ అంటూ సలహా ఇచ్చారు.

కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతి భారతీయుడ్ని సన్నద్ధం చేయడంపై దృష్టి నిలపండి అంటూ హితవు పలికారు.అంతేకాదు, కరోనా ప్రబలుతుండడంపై సింగపూర్ ప్రధాని తమ దేశ ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నాడో చూడండి అంటూ ఓ వీడియోను కూడా రాహుల్ పోస్టు చేశారు. ప్రతి దేశాధినేతకు పరిస్థితులు కొన్నిసార్లు పరీక్ష పెడతాయని పేర్కొన్నారు.

Related posts