telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కర్నూలు మరో రాముల వారి విగ్రహ ద్వంసం చేసిన దుండగులు…

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఒక పక్క రామతీర్ధం ఘటన కొనసాగుతుండగానే కర్నూలు జిల్లా కోసిగి సమీపంలో ఉన్న మర్లబండ అంజనేయస్వామి గాలిగోపురంపై ఉండే సీతారాముల విగ్రహం కాళ్లను గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేశారు. అనంతరం గుడిలోకి చొరబడి హుండీలు దొంగిలించారు. ఈ రోజు ఉదయం అర్చకులు ఉదయం పూజలు చేయడానికి వెళ్ళడంతో చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే గుడి పెద్దలకు సమాచారం అందించడంతో హుటాహుటిన అలయధర్మ కర్తలు విశ్వనాథ్రెడ్డి, మౌనయ్య ఆచారి విగ్రహలను పరిశీలించారు. మూడు రోజులా క్రితం మర్లబండ అంజనేయస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని జాతర జరిగిన మూడు రోజులకే ఈ విధంగా విగ్రహాలపై దాడులు చేసి హుండీలు దొంగిలించారని తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులు స్వామి వారికి భారీ మెత్తంలో మెుక్కుబడులను చెల్లించుకున్నారని, ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు స్వామి ఆలయంలోకి వెళ్లేందుకు ఇనుప కడ్డీలను కోసి హుండీలు దోంగలించారని తెలిపారు. చూడాలి మరి ఈ దాడులు ఎప్పటికి ఆగుతాయి అనేది.

Related posts