telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నియంత్రణపై మరింత దృష్టి సారించాలి: కేంద్రం

karona chekup hospital

కరోనాను నియంత్రించేందుకు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ కీలక ప్రకటన వెలువరించింది. ఇండియాలో ప్రస్తుతం ప్రతి 96 గంటలకూ వైరస్ పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపింది. దేశంలోని 736 జిల్లాల్లో 300 జిల్లాలకు వైరస్ వ్యాపించిందని గుర్తు చేసిన ఆరోగ్య శాఖ, అన్ని రాష్ట్రాలూ తాము ఇటీవల విడుదల చేసిన “కంటైన్ మెంట్ ప్లాన్ ఫర్ లార్జ్ అవుట్ బ్రేక్స్” సూచనలను అనుసరించి వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నాయని పేర్కొంది.

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరిన్ని చర్యలకు ఉపక్రమించాలని తెలిపింది. వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల సరిహద్దులపై పెంచాలి. టెస్టింగ్ లాబొరేటరీల సామర్థ్యాన్ని విస్తరించాలి. అన్ని అనుమానిత కేసుల రక్త పరీక్షలూ జరిపించాలి. ఐసొలేషన్ వార్డుల సంఖ్యను పెంచాలి. హై రిస్క్ కాంటాక్టులపై నిరంతర నిఘా ఉంచాలి. వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి సత్వర చికిత్స కూడా ముఖ్యమేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇక సామాజిక దూరం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని, వైరస్ హాట్ స్పాట్ లపై ఓ పరిధిని నిర్ణయించుకుని ముందడుగు వేయడం ద్వారా, మరో ప్రాంతానికి వైరస్ వెళ్లకుండా చేయవచ్చని సూచించింది. హెల్త్ కేర్ వర్కర్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని ఇవ్వాలని, తద్వారా వారు వైరస్ బారిన పడకుండా నియంత్రించ వచ్చని సూచించింది. ఆడియో, విజువల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచే చర్యలు చేపట్టాలని కోరింది.

Related posts